: నరైన్ 'ఆఫ్ స్పిన్'పై నిషేధం... స్ట్రెయిట్ డెలివరీలు విసరొచ్చట!


కరీబియన్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ మరోసారి అనుమానాలకు తావివ్వడంతో చర్యలు తీసుకున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నరైన్ బౌలింగ్ తీరుపై అంపైర్ల నివేదికను పరిశీలించిన బీసీసీఐ అనుమానిత బౌలింగ్ యాక్షన్ కమిటీ నిషేధం విధించింది. నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయరాదని స్పష్టం చేసింది. అయితే, అతడు నకుల్ బాల్స్ (పంజా బంతులు-వేలికొసలతో బంతిని నొక్కి పట్టుకుని విసురుతారు), స్ట్రెయిట్ డెలివరీలు విసరొచ్చని తెలిపింది. నరైన్ బౌలింగ్ తీరుపై అభ్యంతరాలు ఇదే తొలిసారి కాదు. గతేడాది జరిగిన చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నీలోనూ అతడి యాక్షన్ పై సందేహాలు వచ్చాయి. అయితే, బౌలింగ్ యాక్షన్ సరిచేసుకున్న అనంతరం, చెన్నైలోని బీసీసీఐ పరీక్షా కేంద్రంలో పరిశీలించారు. అటుమీదటే ఐపీఎల్-8కి అనుమతించారు.

  • Loading...

More Telugu News