: ప్రసాద్ రెడ్డి హత్య వెనుక ఉన్నది పరిటాల సునీత కుమారుడు శ్రీరామా?


అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా నేత ప్రసాద్ రెడ్డి హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ హత్యపై ఆయన బంధువులు స్పందించారు. ఓ టీవీ ఛానల్ తో ప్రసాద్ రెడ్డి బంధువు సోమశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఈ హత్యకు మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ బాధ్యుడని ఆరోపించారు. ఈ హత్య ఉదంతంలో శ్రీరామ్ ను ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం పొంచి ఉందని తాము ముందే ఊహించామని... జిల్లా ఎస్పీని కలసి భద్రత కల్పించాలని కోరామని... అయితే, జిల్లాలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల సెక్యూరిటీ అవసరం లేదని ఎస్పీ చెప్పారని తెలిపారు. భద్రత కల్పించి ఉంటే, ఇంత ఘోరం జరగకపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News