: భూకంప బాధితుల కోసం ఏదైనా చేస్తా: అమితాబ్


నేపాల్, భారత్ భూకంప బాధితులకు సాయం చేసేందుకు బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. వారికోసం తనవంతుగా ఏదైనా చేస్తానంటున్నారు. అంతేగాక ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. "భూకంప బాధితులు కుదురుకుని, విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే మన అన్నదమ్ములు, సోదరీమణులకు మనవంతు సహాయం తప్పకుండా చేయాలి. కాలం గడచిపోతుంది. కానీ, ఆలోచనలు, ప్రార్థనలు మాత్రమే నేపాల్, భారత్ భూకంప బాధితులతో మిగిలి ఉంటాయి" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు. భూకంప వినాశకర వీడియోలు చూస్తుంటే భయపెట్టే విధంగా ఉన్నాయని, ప్రకృతి క్రూరత్వాన్ని మాటల్లో పోల్చలేమని అమితాబ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News