: పెళ్లిలో నృత్యం చేసేందుకు రూ. 4 కోట్లు డిమాండ్ చేసిన నటి... ఇస్తానన్న లండన్ వ్యాపారవేత్త
తన కొడుకు పెళ్లిని ఘనంగా చెయ్యాలని భావించిన లండన్ వ్యాపారవేత్త, వేడుకల్లో నృత్యం చేసేందుకు ఎవరైనా బాలీవుడ్ నటిని పిలవాలని భావించాడు. పలువురిని సంప్రదించాడు కూడా. చివరికి నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఒప్పుకుంది. కాసేపు డ్యాన్స్ చేసేందుకు అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు అడిగింది. దీనికి ఆ వ్యాపారవేత్త కూడా సరేనన్నాడు. ఆమె రాకపోకల ఖర్చు, రెండు రోజులు లండన్ లో ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పాడట. లండన్ శివార్లలో జరిగే పెళ్లి వేడుకలో తను నటించిన చిత్రాల్లోని పాటలతో పాటు, ఇతర హిట్ సాంగ్స్ కు కూడా జాక్వలిన్ నృత్యం చేస్తుందట. ఈ డీల్ ఓకే అయినట్టు ఆమె ప్రతినిధి కూడా స్పష్టం చేశాడు.