: తలసాని రాజీనామా చేశానంటున్నారు... దానిని ఆమోదించాలని స్పీకర్ కు టీ.టీడీపీ నేతల విజ్ఞప్తి


పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు ఈరోజు స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశానని చెబుతున్నారని, ఆయన రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని స్పీకర్ ను వారు ప్రశ్నించినట్టు తెలిసింది. అటు టీడీపీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డిలపై కూడా ఫిరాయింపు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ ను కలసిన వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి తదితరులున్నారు. తరువాత వారు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, కడియం శ్రీహరి ఎంపీగా వేతనం తీసుకుంటూ రాష్ట్ర మంత్రిగా కొనసాగటం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ సభల్లో పాల్గొంటున్నారని, ఆమెపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News