: రైతులకు ఊరట... ధాన్యంలో తేమ శాతం నిబంధనలను సడలించిన కేంద్రం
మార్కెట్ యార్డులకు తరలించే ధాన్యంలో తేమ శాతం లేకుంగా జాగ్రత్త పడాలి. ఇందుకోసం రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలి. ఈలోగా వర్షం పడితే, అంతే సంగతులు. చేతికందిన ధాన్యం వర్షార్పణం కాక తప్పదు. ఈ తరహా ఇబ్బందుల నుంచి రైతులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. ఈ మేరకు ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు నేటి కేబినెట్ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాల సమాచారం. రైతులు తీసుకొచ్చే ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్రయ కేంద్రాలకు త్వరలో ఆదేశాలు జారీ కానున్నాయి.