: స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్... యూపీఏ హౌసింగ్ ప్రాజెక్టులకూ ఆమోదం


దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలను తలదన్నే రీతిలో సకల హంగులతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు ఏపీకి చెందిన విశాఖ కూడా ఎంపికైంది. ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా మోదీ, స్మార్ట్ సిటీల ప్రస్తావన తెచ్చారు. ఇదిలా ఉంటే, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన కేంద్ర కేబినెట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ప్రారంభించిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News