: ఆగ్రహించినా, వేడుకున్నా కరగని ఇండోనేషియా, ఆ ఎనిమిది మందీ ఇక లేరు


మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారన్న అభియోగాలపై మరణశిక్షను ఎదుర్కొని పదేళ్లుగా జైల్లో ఉంటూ, మంచిపేరు తెచ్చుకున్న 8 మందిపై ఇండోనేషియా కనికరం చూపలేదు. ఏడుగురు విదేశీయులు సహా 8 మందిని అత్యంత కిరాతకంగా తుపాకి తూటాలకు బలిచేసింది. అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో వారిని కాల్చి చంపడం ద్వారా మరణశిక్ష అమలు చేసింది. వారికి క్షమాభిక్ష పెట్టాలని అంతర్జాతీయ సమాజం ఎన్ని వినతులు చేసినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, నైజీరియా దేశాలు బెదిరించినా ఇండోనేషియా ప్రభుత్వం కరగలేదు. ఆఖరి నిమిషంలో వచ్చిన క్షమాభిక్ష వేడుకోలు సైతం తిరస్కరణకు గురికాగా, వారికి శిక్ష అమలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జావా ద్వీపం సమీపంలోని నుసా కంబన్ గాంలో ఉన్న పసిర్ పుతిహ్ జైలులో వీరిని విడివిడిగా కాల్చి చంపినట్టు ఇండోనేషియా అటార్నీ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 మంది నిందితులు పదేళ్ల క్రితం డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడగా, వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఆమెకు మాత్రం శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వివరించారు. శిక్ష అమలుకు ముందు వారు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఇచ్చామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News