: దుర్గమ్మ బంగారు కిరీటం చోరుడు అరెస్ట్... రహస్యంగా విచారిస్తున్న బెజవాడ పోలీసులు
బెజవాడ కనకదుర్గమ్మ తల్లి బంగారు కిరీటం చోరీ కేసులో కీలక నిందితుడు ప్రకాశ్ సాహూను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గతరాత్రి అదుపులోకి తీసుకున్న అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. బెజవాడలోని కృష్ణలంకలోని ఓ లాడ్జీలో మకాం పెట్టిన సాహూ, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ఇతడిపై ఏపీలో పలు చోరీ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయంలో సాహూ చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీతో రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడను జల్లెడ పట్టగా కృష్ణలంకలో సాహూ అరెస్టయ్యాడు.