: నేపాలీ అనాథలకు అమ్మానాన్మలమవుతాం: వీహెచ్ పీ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా
భూకంపంతో పెను విలయానికి గురైన నేపాల్ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతామని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా నిన్న అలహాబాదులో విస్పష్ట ప్రకటన చేశారు. నేపాల్ లో కుప్పకూలిన భవనాలను పునర్నిర్మించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ప్రకృతి విలయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన వేలాది మంది నేపాలీ చిన్నారుల బాధ్యత ఇక తమదేనని ప్రకటించారు. అనాథ బాలలందరినీ భారత్ కు తీసుకొచ్చి తమ ఆశ్రమ పాఠశాలలు, అనాథాశ్రమాల్లో చేర్పించుకుంటామని తెలిపారు. ఆ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు.