: 6 వికెట్లకు 134 పరుగులు చేసిన సూపర్ కింగ్స్... చెరో 2 వికెట్లు తీసిన చావ్లా, రస్సెల్
ఆదిలో దూకుడు కనబర్చిన చెన్నై బ్యాట్స్ మెన్ ఆపై తేలిపోయారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు రాణించడంతో సూపర్ కింగ్స్ పరుగులు చేయలేక ఇబ్బందిపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేశారు. చావ్లా, రస్సెల్ చెరో రెండు వికెట్లు తీశారు. స్మిత్ 25, మెక్ కల్లమ్ 19, కెప్టెన్ ధోనీ 3, బ్రావో 5, జడేజా 15 పరుగులు చేశారు. డు ప్లెసిస్ (29 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉన్నా వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కాపాడుకున్నా, పరుగులు రాబట్టలేకపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బరిలో దిగిన ఆసీస్ బౌలర్ పాట్రిక్ కమ్మిన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.