: వాట్సప్ లో పుకార్లు...ఎమ్మెల్యేపై కేసు


భూకంపంపై వదంతులు వ్యాప్తి చేశారంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే దయానంద రాయ్ పై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్ లోని అరారియా జిల్లాలోని నార్పట్ గంజ్ నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన దయానంద రాయ్ శనివారం రాత్రి భారీ భూకంపం రానుందని వాట్సప్ లో పలువురికి మెసేజ్ లు పంపినట్టు పాట్నా ఎస్పీ జితేంద్ర రాణా తెలిపారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఆదివారం తెల్లవారు జామున నేపాల్ లో భారీ భూకంపం రావడం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో భూమి కంపించడం విశేషం.

  • Loading...

More Telugu News