: నేపాల్ బాధితుల్లో 50 వేల మంది గర్భిణీలే!


నేపాల్ భూకంపం కారణంగా వైద్యసదుపాయాల అవసరం పెరుగుతోంది. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుందడానికి తోడు, అంటువ్యాధులు ప్రబల కుండా రక్షణ చర్యలు తీసుకునేందుకు వైద్యులు అవసరమవుతున్నారని అంతర్జాతీయ సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. ఇల్లు నేలమట్టం కావడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంప బాధితుల్లో దాదాపు 50 వేల మంది గర్భిణీలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యునైటెడ్ నెషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ వెల్లడించిన ప్రాథమిక అంచనా ప్రకారం, భూకంప ప్రమాదం నుంచి బతికి బట్టకట్టిన వారిలో దాదాపు 50 వేల మంది గర్భిణీలు ఉన్నారట. వారందరికీ ప్రత్యేకమైన వైద్య సదుపాయం అవసరమని ఆ సంస్ధ వెల్లడించింది.

  • Loading...

More Telugu News