: ఖాట్మండూ కదిలినా... ఎవరెస్ట్ చెక్కుచెదరలేదు!
భూమి లోపలి పొరల్లో ఏర్పడిన పెను ఒత్తిడి తీవ్ర భూకంపం రూపంలో బయటపడగా, ఆ ప్రకృతి విలయానికి నేపాల్ బలయిపోయింది. రాజధాని ఖాట్మండూపై అధిక ప్రభావం కనిపించింది. ఈ భూకంపం కారణంగా ఖాట్మండూ నగరం కింద నేల దక్షిణంవైపుకు కదిలినట్టు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకులు అంచనా వేశారు. మూడు మీటర్లు పక్కకు జరిగిందని వారు తెలిపారు. సమీపంలోని ఎవరెస్టు శిఖరం మాత్రం తన ఘనతను నిలుపుకుంది. రిక్టర్ స్కేల్ పై 7కి పైగా తీవ్రత నమోదైనా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి మార్పులేదని వివరించారు. అయితే, బేస్ క్యాంపులు ధ్వంసమయ్యాయని తెలిపారు.