: ఈ రాత్రికి భారత్ చేరుకోనున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ విజయ్ మృతదేహం


నేపాల్ లో సంభవించిన భూకంపం ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచివేసింది. షూటింగ్ కోసమని నేపాల్ వెళ్లి, అక్కడ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న 'ఎటకారం' చిత్ర బృందంలో కొరియోగ్రాఫర్ విజయ్ మరణించడం తెలిసిందే. అతని మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, విజయ్ మృతదేహం ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనుంది. అక్కడి నుంచి బాపట్ల తరలిస్తారని తెలుస్తోంది. విజయ్ స్వస్థలం బాపట్ల. కాగా, భూకంపం ధాటికి ఓ బాలీవుడ్ సినిమా యూనిట్ సభ్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.

  • Loading...

More Telugu News