: పోలీస్ కస్టడీకి 'ఎర్ర' హీరోయిన్ నీతూ అగర్వాల్


ఎర్రచందనం స్మగ్లర్ల ఉచ్చులో చిక్కుకుని కటకటాలపాలైన నటి నీతూ అగర్వాల్ ను శేషాచలం ఎర్రచందనం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు రాబట్టాలంటే ఆమెను కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన వాదనకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో రెండు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తున్నట్టు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కర్నూలు జిల్లా పోలీసులు ఆమెను నంద్యాల జైలు నుంచి రుద్రవరం జైలుకు తరలించారు. కాగా,నీతూ అగర్వాల్ ను ఈ నెల 26న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News