: ఎవరో కావాలనే నన్ను ఇరికించారు: నటి కరాటే కల్యాణి


పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన టాలీవుడ్ నటి కరాటే కల్యాణి, ఎవరో కావాలనే తనను ఇందులో ఇరికించారని తెలిపారు. తనకు పేకాట అలవాటు ఉందని, తప్పయితే కోర్టు చూసుకుంటుందని పేర్కొన్నారు. ఎందరో పెద్దమనుషులు పేకాడుతున్నారని, అలాంటి వాళ్లను కూడా పట్టుకోవాలని సూచించారు. మీడియా కూడా సంయమనం పాటించాలన్నారు. ఇతర అనుమానాలు కలిగేలా తనపై కథనాలు రాయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. తనకు మూడు ముక్కలాట తెలియదని, రమ్మీ ఆడేందుకు వెళ్లానని వివరించారు. హరికథా కళాపీఠం ఏర్పాటుకు శ్రమిస్తున్నానని, ఇంతలోనే ఇలా జరిగిందని వాపోయారు. కళాపీఠం ఏర్పాటు నచ్చని వ్యక్తులే తనను పేకాట కేసులో ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News