: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు


కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదైంది. ఆమె భర్త రామ్మోహన్ రావు తనపై దౌర్జన్యం చేశారంటూ సుగుణ అనే మహిళ విశాఖ జిల్లా భీమిలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో కృపారాణి భర్త, ఆయన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే వారు ఘర్షణ పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తన భర్తపై కేసు నమోదు చేయొద్దని కృపారాణి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News