: పర్వతారోహణకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా వాసులు క్షేమం


ఎవరెస్టు పర్వతారోహణకు వెళ్లి నేపాల్ భూకంపం కారణంగా గల్లంతైన పశ్చిమగోదావరి జిల్లా వాసులు టిబి శుక్లా, జయమంగళ జనార్దన్ లు క్షేమంగా ఉన్నారని తెలిసింది. తాము క్షేమంగానే ఉన్నామని వారిద్దరూ ఫోన్ చేసి చెప్పినట్టు ఏఓవైఎమ్ పాఠశాల సిబ్బంది తెలిపారు. దాంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని యలమంచిలి మండలం కాంబొట్ల పాలెంలో ఎ.వై.ఆంగ్ల మీడియం పాఠశాలను శుక్లా నిర్వహిస్తున్నారు. జనార్దన్ కూడా అదే పాఠశాలలో చదివి ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాశాడు. ఈ నెల 13న వారిద్దరూ నేపాల్ బయలుదేరి వెళ్లారు. 22న చివరిసారిగా వాళ్లిద్దరూ తమ ఊరి వారితో మాట్లాడారు. నేపాల్ లో ఈ నెల 25 భూకంపం రావడంతో సంబంధాలు తెగిపోయాయి.

  • Loading...

More Telugu News