: జయ కేసులో కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం


ఏఐ ఏడీఎంకే అధినేత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య నియమితులయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ నేపథ్యంలో జయ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక హైకోర్టుకు లిఖితపూర్వకంగా ఆయన తెలపనున్నారు. గతంలో ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ ను నియమించడాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. అందుకే కొత్త ప్రాసిక్యూటర్ గా ఆచార్యను నియమించాలని కర్ణాటక నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News