: కేంద్ర మంత్రి నివాసంలో టీవీ జర్నలిస్టుతో గొడవపడిన విజయకాంత్


డీఎండీకే చీఫ్, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ ఓ టీవీ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశం అయింది. విజయకాంత్ సోమవారం నాడు ప్రధాని మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోదీతో ఏం మాట్లాడారో చెప్పాలని జర్నలిస్టులు విజయకాంత్ ను కోరారు. అయితే, ఆ భేటీ వ్యక్తిగతమని, ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని డీఎండీకే అధినేత బదులిచ్చారు. దీనిపై పాత్రికేయులు రెట్టించారు. దీంతో, విజయకాంత్ సహనం కోల్పోయారు. మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఓ టీవీ జర్నలిస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో, పార్టీ నేతలు మీడియా సమావేశం కొనసాగించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News