: 24 గంటలే టైమ్... టీడీపీకి ప.గో.జి కార్యకర్తల అల్టిమేటం


పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా పేరు మాయమవడంపై ఆయన వర్గీయులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో ఆయన పేరును టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో చేర్చకుంటే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని తణుకు టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణకు తణుకుకు చెందిన 32మంది టీడీపీ కౌన్సిలర్లు అల్టిమేటం ఇచ్చారు. కాగా, టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో రాజా పేరు ఖరారైనట్టు నిన్న ప్రచారం జరిగింది. అయితే, తదనంతర పరిణామాల్లో ఆయన పేరు తొలగించినట్టు సమాచారం. దీంతో తణుకు టీడీపీలో ఆందోళన రేగుతోంది.

  • Loading...

More Telugu News