: నాన్ టీచింగ్ ఉద్యోగిపై చేయిచేసుకున్న ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్


విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్ నాన్ టీచింగ్ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెసర్ రాజ్ కుమార్ తన పర్సనల్ బిల్లు తయారుచేయాలని బోధనేతర ఉద్యోగి నర్సింహారావుకు సూచించారు. అయితే, ఆ ఉద్యోగి కాలయాపన చేస్తుండడంతో ప్రొఫెసర్ అసహనానికి గురయ్యారు. మంగళవారం కూడా ఈ విషయమై నర్సింహారావును కదిపిన ప్రొఫెసర్ కు నిర్లక్ష్యపూరితమైన సమాధానం ఎదురైంది. దీంతో, ఆయన ఆగ్రహంతో నర్సింహారావుపై చేయిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో, వర్శిటీ బోధన, బోధనేతర వర్గాలు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. ప్రొఫెసర్ రాజ్ కుమార్ వెంటనే సెలవుపై వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై వర్శిటీ పాలకవర్గం దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News