: తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతి తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెన్ కో, ట్రాన్స్ కోలో 1492 ఏఈలు, 427 ఎస్ఈలు కలిపి మొత్తం 1,919 ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సర్కారు అనుమతి తెలిపింది. త్వరలోనే వాటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని రోజులకే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.