: రేణుకా చౌదరి నుంచి మా డబ్బు ఇప్పించండి... ఏఐసీసీ కార్యదర్శికి రాంజీ నాయక్ భార్య వినతిపత్రం
వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీసుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలంటూ ఏఐసీసీ కార్యదర్శి కుంతియాకు రాంజీ నాయక్ భార్య కళావతి వినతిపత్రం సమర్పించారు. దీనికి స్పందించిన కుంతియా, ఈ సమస్యను పార్టీ అధిస్ఠానం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యాలయంలో కుంతియా, పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అంతకుముందు కార్యాలయం ఎదుట రాంజీ భార్య ఆందోళన చేశారు. ఆమెకు మద్దతుగా రాంజీ నాయక్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన జరిపారు. గత నెలలో ఇదే విషయంలో తీవ్ర నిరసన చేసిన రాంజీ భార్య, రేణుక అనుచరుడు సైదులు నాయక్ పై చెప్పు విసిరిన విషయం విదితమే.