: పశ్చిమ బెంగాల్ ‘స్థానికం’లో మమత జయభేరీ... కోల్ కతా కార్పొరేషన్ తృణమూల్ కైవసం


పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ కాలం పాటు సాగిన కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తాజాగా ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కోల్ కతా నగర పాలక సంస్థతో పాటు రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకూ ఎన్నికలు జరిగాయి. నేటి ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ దూసుకెళుతోంది. ఇప్పటికే కోల్ కతాలోని మొత్తం 144 వార్డుల్లో 113 స్థానాల్లో విజయం సాధించిన మమతా బెనర్జీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఇక రాష్ట్రంలో మొత్తం 92 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 72 మునిసిపాలిటీల్లో ఆ పార్టీ విజయదుందుభి మోగించింది. మమతా బెనర్జీ పార్టీ విజయభేరీతో విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.

  • Loading...

More Telugu News