: న్యూయార్క్ న్యాయమూర్తిగా భారత మహిళ... బాధ్యతలు స్వీకరించిన రాజరాజేశ్వరి
అగ్రరాజ్యం అమెరికాలో భారత కీర్తి దశదిశలా వ్యాపిస్తోంది. ఇప్పటికే అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల పదవి చేపట్టి తనదైన శైలిలో రాణిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన రాజరాజేశ్వరి అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. యుక్తవయసులోనే అమెరికా వెళ్లిన రాజరాజేశ్వరి ఆ దేశ న్యాయ వ్యవస్థలో తనదైన శైలిలో రాణించారు. కొద్దిసేపటి క్రితం మరో 26 మందితో కలిసి రాజరాజేశ్వరి న్యూయార్క్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల చేత న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ప్రమాణం చేయించారు.