: టీఆర్ఎస్ నూతన ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు


తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మే 1వ తేదీ నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పనితీరుపై అవగాహన కోసం ఈ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఈ మేరకు మంత్రి తరగతుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పార్టీనుంచి మొదటిసారి మంత్రులుగా చేస్తున్నవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో అస్కి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు శిక్షణా తరగతుల నిర్వహిస్తారన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త హనుమంతరావు, మాజీ సీఈసీలు టీఎన్.శేషన్, లింగ్డోలు ప్రారంభ ఉపన్యాసాలు చేస్తారని జగదీష్ రెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News