: భూకంపంతో రోడ్లపైకి బీహార్ జనం... మాజీ మంత్రుల ఇళ్లల్లో దొంగల స్వైర విహారం


ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట వెలిగించుకునేందుకు నిప్పు అడిగాడట వెనకటికొకడు. ఆదివారం రాత్రి జరిగిన భూకంపం సమయంలో బీహార్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భూ ప్రకంపనలతో ఆ రాష్ట్ర రాజధాని పాట్నా ప్రజలు రోడ్లపైకి పరుగులు పెడితే, దొంగలు మాత్రం నగరంలోని సంపన్నుల ఇళ్లలోకి చొరబడ్డారట. ఈ క్రమంలో నగరంలోని ఎయిర్ పోర్టుకు సమీపంలోని కౌటిల్యా నగర్ లో స్వైరవిహారం చేసిన దొంగలు ముగ్గరు మాజీ మంత్రుల ఇళ్లను కొల్లగొట్టారు. భూప్రకంపనలు తగ్గిన తర్వాత ఇళ్లలోకి వెళ్లి చూసుకున్న ముగ్గురు మాజీ మంత్రులు షాకయ్యారు. ఆ తర్వాత చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితర ముఖ్య నేతల ఇళ్లూ ఉన్నాయి. అయితే దొంగలు మాత్రం ఈ ఇళ్ల పరిసరాల్లోకి మాత్రం వెళ్లలేదు.

  • Loading...

More Telugu News