: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ కృష్ణాజిల్లాకే అగ్రస్థానం
ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ కృష్ణాజిల్లాకే ప్రథమ స్థానం లభించింది. 83 శాతంతో ఈ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, కడప జిల్లా 60 శాతంతో చివరి స్థానంలో నిలిచినట్లు మంత్రి గంటా తెలిపారు. మే 2 నుంచి మార్కుల మెమో జారీ చేస్తామని, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు మే 5 చివరితేదీగా నిర్ణయించినట్టు వివరించారు. ఇక మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫెయిలైన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు పరీక్షలకు ముందు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు, ఇందుకు ఇంటర్ బోర్డు అధికారులు పూర్తిగా సహకరిస్తారన్నారు.