: మా వాళ్లు ఉన్నారో...లేదో?: సందిగ్ధంలో భారత్ లో నేపాల్ కాన్సులేట్ సిబ్బంది


భూకంపం ధాటికి నేపాల్ నేలమట్టమైంది. రాజధాని సహా దేశమంతా పెను విధ్వంసం జరిగింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. అంతకు నాలుగైదు రెట్ల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అక్కడ రోడ్లే ఇళ్లయ్యాయి. ఆస్పత్రులుగానూ మారిపోయాయి. ఎవరు చనిపోయారో, ఎవరు బతికున్నారో తెలియని పరిస్థితి. వివరాలు కనుక్కుందామంటే మొబైల్ సేవలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని నేపాల్ కాన్సులేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆ దేశ అధికారులు తీవ్ర సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు తమ వారు బతికున్నారో, లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది. సమాచారం కనుక్కుందామంటే కుదరడం లేదు. అలాగని అక్కడికి వెళ్లేందుకు వీలు చిక్కడం లేదు. దీంతో కాన్సులేట్ సిబ్బంది దేవుడిపై భారమేసి, తమ దేశానికి భారత్ నుంచి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News