: పెను భూకంపానికి కారణం రాహుల్ గాంధీ చేసిన పాపమే!: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు


వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని విమర్శలపాలు చెయ్యొద్దని ప్రధాని మోదీ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ అధిష్ఠానాన్ని తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టిన ఎంపీ సాక్షీ మహరాజ్ మరో వివాదానికి తెరతీశారు. గొడ్డు మాంసం తినే రాహుల్ గాంధీ పరమ పవిత్రమైన కేదార్ నాథ్ కు వెళ్లినందువల్లే ఇంతటి ప్రళయ భూకంపం సంభవించిందని అన్నారు. "రాహుల్ గాంధీ గొడ్డుమాంసం తింటారు. శుద్ధి చేసుకోకుండానే పవిత్ర ఆలయాలకు వెళ్లారు. ఆయన చేసిన పాపం కారణంగానే భూకంపం వచ్చింది" అని హరిద్వార్ లో వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. ఈ తరహా నీచ రాజకీయాలను ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సుష్మితా దేవ్ విరుచుకుపడ్డారు. తక్షణం సాక్షి మహరాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News