: ఏపీ పోలీసుల అదుపులో తమిళనాడు స్మగ్లర్


ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏపీ పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. శేషాచలం ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచీ ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. అందులో భాగంగా తిరుపతి, తమిళనాడులో ఎప్పటికప్పుడు పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సోము రవి అనే స్మగ్లర్ ను అరెస్టు చేశారు. అతనితో పాటు మరో 11 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పీడీ యాక్టు కింద రవిపై 23 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులను నమోదుచేశారు.

  • Loading...

More Telugu News