: ముచ్చట మూడునాళ్లే... 'పరివారం'లో సీట్ల లొల్లి షురూ


బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచనతో జనతా పరివార్ పేరిట పలు పార్టీల విలీనం ముచ్చట మూడునాళ్లే అవుతుందా? త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, జనతా పరివార్ లో సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక, తొలి విభేదాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా జేడీ-యూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ ల మధ్య సీట్ల పంపిణీపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చేట్టు కనిపించడం లేదు. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ ఇద్దరు నేతలు చొరవచూపి ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలో జనతా పరివార్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి మధ్యే గొడవలు తలెత్తడంతో మిగతా నేతలు తలపట్టుకుంటున్నారు. తమకు అధిక సీట్లు కావాలంటే తమకు అధిక సీట్లు కావాలని వీరు ఒకరిపై ఒకరు ఒత్తిడి తీసుకురావాలని యత్నిస్తున్నారు. తనకు 100కు పైగా స్థానాలు కావాలని లాలూ డిమాండ్ చేస్తుండగా, గత ఎన్నికల్లో కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆర్జేడీకి అందుకు నాలుగు రెట్లు అదనపు సీట్లు ఇచ్చేందుకు నితీష్ నిరాకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News