: రూ. 1000లోపు లక్షన్నర టికెట్లు: స్పైస్ జెట్
జూలై 1 నుంచి అక్టోబర్ 15 మధ్య వినియోగించుకునే వీలుగా రూ.999 ధరపై 1.5 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచినట్టు లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ తెలియజేసింది. ‘ట్రావెల్ లైట్-సేవ్ మోర్’ ఆఫర్ కింద థర్డ్ క్లాస్ రైలు టికెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే దేశీయ విమాన టికెట్ ను అందిస్తామని సంస్థ పేర్కొంది. కాగా, ఈ ఆఫర్ కింద టికెట్లను రేపటిలోగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్రముఖ ఎయిల్ లైన్స్ సంస్థలన్నీ తక్కువ ధరలకు టికెట్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.