: కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కేబిన్... తిరస్కరించిన తెలంగాణ సీఎం!


టీఆర్ఎస్ బహిరంగ సభలో పోలీసులు స్థాయికి మించి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓ వైపు రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని ప్రకటిస్తున్న పోలీసు బాసులు, నిన్నటి పరేడ్ గ్రౌండ్ సభకు వచ్చిన కేసీఆర్ కోసం వారు బుల్లెట్ ప్రూఫ్ కేబిన్ ను సిద్ధం చేశారు. సదరు కేబిన్ నుంచే ప్రసంగించాలని పోలీసులు సీఎం కేసీఆర్ ను కోరారు. అయితే కేసీఆర్ అందుకు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ కేబిన్ ను తొలగించారు. ఇదివరకు ఏ సీఎంకూ బహిరంగ సభల్లో బుల్లెట్ ప్రూఫ్ కేబిన్లు ఏర్పాటు కాలేదు. కేసీఆర్ కోసం ఈ తరహా కేబిన్ ఏర్పాటు కావడంపై దేశవ్యాప్తంగా నిఘా వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News