: రాణించిన వార్నర్, హెన్రిక్స్, ఓజా, ఆశీష్ రెడ్డి...హైదరాబాదు 150/6


సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. డేవిడ్ వార్నర్ (58), హెన్రిక్స్ (30), నమన్ ఓజా (28) రాణింపుకు ఆశీష్ రెడ్డి (22) మెరుపులు తోడవ్వడంతో హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు ఆదిలోనే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. దీంతో కెప్టెన్ వార్నర్ బ్యాటు ఝళిపించాడు. 41 బంతుల్లో 58 పరుగులు చేశాడు. హనుమ విహారీ (9) విఫలమవ్వడంతో క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి ఓజా సహకారమందించడంతో సన్ రైజర్స్ జట్టు భారీ స్కోరు దిశగా సాగింది. వీరిద్దరూ అవుట్ కావడానికి తోడు బొపారా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో, హైదరాబాద్ జట్టు కనీసం 120 పరుగులైనా చేస్తుందా అని సగటు అభిమాని భావించాడు. క్రీజులోకి వచ్చిన ఆశీష్ రెడ్డి ఒక ఫోరు, రెండు సిక్సులతో మెరుపులు మెరిపించడంతో హైదరాబాదు జట్టు 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. పంజాబ్ జట్టులో జాన్సన్, పటేల్ చెరి రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, అనురీత్ సింగ్ చెరో వికెట్ తో వారికి చక్కని సహకారమందించారు. 151 పరుగుల విజయలక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News