: యువకుడిపై గొడ్డలితో దుండగుల దాడి


హైదరాబాదు మూసాపేటలోని జనతానగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన కె.గిరి (18)పై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేశారు. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరి, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో, గిరిని స్థానికులు కూకట్‌ పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిపై జరిగిన ఆకస్మిక దాడికి ప్రేమ వ్యవహారమే కారణమా? లేక స్నేహితుల వివాదమా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News