: ఒకే రోజు 41 వేల బైకులమ్మిన హోండా
అక్షయ తృతీయ అంటే భారతీయ బంగారం వ్యాపారులకు పండగ. వ్యాపార దృక్పథంతో ప్రారంభించిన ఆ రోజు విషయంలో చాలా మందిలో విశ్వాసాలు నాటుకుపోయాయి. ఆ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభదాయకమని మహిళలు భావించడంతో బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరుగుతాయి. అందుకే దానిని మహిళల పండుగ అంటారు. అయితే అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు, వివిధ వస్తువుల కొనుగోళ్లు కూడా జోరందుకుంటాయి. ప్రధానంగా వాహనాల కొనుగోళ్లు కూడా ఆ రోజు భారీ స్థాయిలో జరుపుతారు. ముహర్త బలం కుదరడంతో అక్షయ తృతీయ రోజున హోండా మోటార్ సైకిల్స్ సంస్థ ఏకంగా 41వేల బైకులను అమ్మింది. గతేడాది అక్షయ తృతీయ రోజున జరిగిన అమ్మకాలతో పోలిస్తే వాహనాల అమ్మంలో 50 శాతం వృద్ధి సాధించినట్టు హోండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ ఎస్ గెలెరియా తెలిపారు.