: 'ఉత్తమ విలన్'కు ఊరట
కమలహాసన్ తాజా చిత్రం ఉత్తమ విలన్ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోగా, మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని, అందులోని ఓ పాటను తొలగించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారించిన కోర్టు పిటిషన్ లో సహేతుకత లేదంటూ కొట్టిపారేసింది. కాగా, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు, అతని తండ్రి హిరణ్య కశిపుడికి మధ్య వచ్చే సంభాషణను కించపరిచే విధంగా పాటలో సాహిత్యం ఉందని పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేదేనని పిటిషన్ లో పేర్కొన్నారు.