: రిమాండ్ హోం గార్డును కొట్టి పారిపోయిన బాలురు
వివిధ నేరాల్లో ఖైదీలుగా ఉన్న ఆరుగురు బాలురు రిమాండ్ హోం గార్డును గాయపరిచి పరారైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు మైనర్ బాలురు పరదేశీపురాలోని రిమాండ్ హోంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో గతరాత్రి పహారా కాస్తున్న గార్డుతో ఘర్షణకు దిగారు. అనంతరం ఆయన విధుల్లో ఉండగా, ఇనుప రాడ్లతో ఆయనను గాయపరిచి, రిమాండ్ హోం నుంచి తప్పించుకుని పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి, బాలుర కోసం గాలిస్తున్నారు.