: ఆంధ్రా వెళ్లి ప్రజల వెంటబడి చావు... పో: కేసీఆర్
టీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చురకలంటించారు. పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలు, అబద్ధాలేనని, అంతా మీడియా మేనేజ్ మెంటేనని ఆరోపించారు. వాస్తవానికి అక్కడేమీ ప్రజా సంక్షేమం జరగడం లేదని అన్నారు. అలాంటి వ్యక్తి మహబూబ్ నగర్ వచ్చి, 'కేసీఆర్ నిన్ను నిద్రబోనియ్య' అంటాడని, కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజు చేయిస్తానన్నాడట" అని ఎద్దేవా చేశారు. "నీ రాష్ట్రంలో దిక్కులేదు గానీ, ఇక్కడికొచ్చి నిన్ను నిద్రబోనియ్య, నన్ను నిద్రబోనియ్య అనడం కాదు, ఆంధ్రా వెళ్లి ప్రజల వెంటబడి చావు పో" అంటూ ఈసడించుకున్నారు. అయినా, ఇక్కడేమున్నదో తనకు అర్థం కాదని అన్నారు.