: టాస్ గెలిచిన పంజాబ్...హైదరాబాదు బ్యాటింగ్


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు మొహాలీలో తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు, నాలుగేసి మ్యాచ్ లలో ఓటమి పాలై, రెండేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ లో సత్తాచాటి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ జార్జి బెయిలీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ లో బలహీనంగా ఉన్న హైదరాబాద్ జట్టు కీలక బౌలర్ స్టెయిన్ కు విశ్రాంతినిచ్చి హనుమ విహారిని తీసుకుంది.

  • Loading...

More Telugu News