: ఎందరు విన్నవించినా, వారికి మరణశిక్ష తప్పడం లేదు!


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ఆస్ట్రేలియా అధ్యక్షుడు టోనీ అబోట్, పలు దేశాల ప్రతినిధులు, మానవహక్కుల సంఘాలు చేసిన విజ్ఞప్తులను ఇండోనేసియా అధ్యక్షుడు విడోడో పట్టించుకోలేదు. ఇండోనేసియాలోని బాలి నగరం నుంచి ఆస్ట్రేలియాకు మత్తు (డ్రగ్స్) పదార్థాలు తరలిస్తూ ఆస్ట్రేలియా పౌరులు ఆండ్రీ చాన్, మైయూరన్ సుకుమారన్, బ్రెజిల్ దేశీయుడు రోడ్రిగో గుటార్టే, నైజీరియన్ అయోటాంజ్, ఫిలిప్పీన్ ఫీస్టా వెలిగోలను పోలీసులు 2005లో అరెస్టు చేశారు. అప్పుడే న్యాయస్థానం వారికి మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంఘాల ఒత్తిళ్లు, నిందితుల అప్పీళ్లతో పలు మార్లు న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో భారీ జరిమానా కడితే 20 ఏళ్ల జైలు శిక్షతో వదిలేస్తామని న్యాయస్థానం చెప్పింది. వారి ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో వారు తమ దేశాధినేతలను ఆశ్రయించారు. వారు ఒత్తిడి చేసినప్పటికీ చట్టాల ప్రకారమే ఇండోనేసియా ముందుకు వెళ్లడం విశేషం. దీంతో వారికి బుధవారం మరణశిక్ష అమలు చేయనున్నారు. వారిని కాల్చి చంపేందుకు 12 మందితో కూడిన షూటింగ్ స్క్వాడ్ ను సిద్ధం చేశారు. వారి శవాలను ఖననం చేసేందుకు పెట్టెలను కూడా సిద్ధం చేశారు. దోషుల ఆఖరు కోరికలు తీర్చి వారికి మరణశిక్ష అమలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News