: బెంగాల్, బీహార్ లో ప్రకంపనలు...పరుగులు పెట్టిన ప్రజలు
పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. అకస్మాత్తుగా కాళ్ల కింద భూమి కదలడంతో ఇళ్లలోంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. కాగా, నేపాల్ లో పదేపదే భూమి ప్రకంపనలు ఇస్తోంది. దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో సేదదీరుతున్నారు. ఖాట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విదేశీయులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తప్ప, ఇతరులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు తీసుకునేందుకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో దాని ముందు ప్రయాణికులు బారులుతీరారు.