: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ గులాబీమయం... స్టెప్పేసిన నాయిని
సికింద్రాబాద్ పరేడ్ మైదానం గులాబీమయమైంది. ఇక్కడ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చారు. కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో విచ్చేశారు. ప్రస్తుతం అక్కడ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమంతో సభికులను రంజింపజేస్తున్నారు. మైదానం వెలుపల కూడా భారీ జనసందోహం నెలకొని ఉంది. అటు, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆనందంతో నర్తించారు. 'ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా' అన్న పాటకు అనుగుణంగా ఆయన కాలు కదిపారు. దీంతో, సభలో పెద్ద పెట్టున హర్షధ్వానాలు చోటుచేసుకున్నాయి. పరేడ్ మైదానం 'జై తెలంగాణ' నినాదాలతో హోరెత్తుతోంది.