: నేపాల్ భూకంపాన్ని పసిగట్టిన పక్షులు
ప్రకృతి వైపరీత్యాలను పక్షులు, జంతువులు ముందుగానే పసిగడతాయని నిపుణులు పేర్కొంటుంటారు. పెద్దలు కూడా అదే విషయాల్ని చెప్పేవారు. వాటిని నిజం చేస్తూ నేపాల్ లో భూకంపం వచ్చిన రోజున పక్షులు వేలాదిగా అలజడికి గురయ్యాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని చారిత్రాత్మక ప్రదేశం దర్బార్ స్క్వేర్ దగ్గర అంతా సరదాగా గడుపుతున్న సమయంలో భూకంపం సంభవించగానే వేలాది పక్షులు పిచ్చెక్కినట్టు గోలచేస్తూ గాల్లో చక్కర్లు కొట్టాయట. ఇంతలోనే దట్టంగా ధూళికమ్మడం, కాళ్ల కింద భూమి కదలడం స్ధానికులు గుర్తించారు. దీంతో కొంత మంది పరుగులు తీశారట. కాగా, పక్షుల అలజడిని పర్యాటక వీడియో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.