: పెరగనున్న 'పెట్రో' ధరలు!
పెట్రో ఉత్పత్తుల ధరలు మరోసారి పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 4 నెలల గరిష్ఠానికి చేరిన తరుణంలో దేశవాళీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవచ్చని సమాచారం. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ప్రస్తుతం 65.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్చి తరువాత బ్యారల్ క్రూడాయిల్ ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. కాగా, అప్పటి నుంచి ముడి చమురు ధర 9 డాలర్ల మేరకు పెరిగింది. మరో నెల రోజుల వ్యవధిలో ఈ ధర 70 డాలర్ల వరకూ చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు అనలిస్టులు వ్యాఖ్యానించారు. ఈ నెల ఆరంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే.