: నేపాలీల మనోధైర్యానికి సెల్యూట్... మోదీ ట్వీట్స్!


పెను భూకంపం నేపాల్ ను రాజధాని సహా నేలమట్టం చేసింది. దేశాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో నేపాల్ ప్రజలు తమ ఆప్తుల కోసం వెతుకులాట సాగిస్తూనే, క్షతగాత్రులకు చేయూతనందిస్తున్నారు. తినడానికి తిండి, పడుకోవడానికి గూడు లేకపోయినా, రోడ్లపైనా నివసిస్తున్నారు. నేపాలీల ధైర్యాన్ని చూసి భారత ప్రధాని నరేంద్ర మోదీ వారిలో మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ‘‘నేపాలీల మొక్కవోని ధైర్యానికి సెల్యూట్’’ అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. నేపాల్ లో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేదాకా భారత్ సహాయం అందిస్తుందని ఆయన ప్రకటించారు. నేపాల్ లో భారత్ తరఫున సేవలందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, సైనిక బలగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News