: డిసెంబర్ 15లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయండి: హైకోర్టు ఆదేశం


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. డిసెంబర్ 15లోగా ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 31లోగా వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తి చేయాలని పేర్కొంది. ఈ అంశంపై ఈ నెలలో పలుమార్లు జరిగిన వాదనల సమయంలో ఎన్నికల నిర్వహణకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దానిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు 225 రోజుల గడువు ఇచ్చింది. అయితే అంతకంటే ఎక్కువ సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నందున అదనపు సమయం కోరడం సరికాదని కోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News